'తెలంగాణ ఉద్యమంలో అశోక్ కుమార్ ది కీలక పాత్ర'

తెలంగాణ ఉద్యమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ కీలక పాత్ర పోషించారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.

Update: 2024-10-04 17:10 GMT

దిశ, సంగారెడ్డి : తెలంగాణ ఉద్యమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ కీలక పాత్ర పోషించారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అశోక్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ లో విద్యా సదస్సు, ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అశోక్ కుమార్ కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపి బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అశోక్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, విజేందర్ రెడ్డి కాసాల బుచ్చిరెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, జలంధర్, పరశురాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.


Similar News