శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యే..
దసరా నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
దిశ, సదాశివపేట : దసరా నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అనుముల సాయిరాజ్ ఆధ్వర్యంలో అమ్మవారిని గాయత్రి దేవి అలంకరణతో అమ్మవారికి అభిషేకం, సామూహిక మహిళా భక్త బృందం కుంకుమ అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరాత్రి విజయదశమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని ఆ అమ్మవారి కృపతోనే ప్రజలందరూ సల్లంగా ఉండాలని వేడుకుంటున్నామన్నారు.
ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను పురపాలక సంఘం చైర్ పర్సన్, కౌన్సిల్ సభ్యులను శాలువా పూలదండలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు కోడురీ అంజయ్య, కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి, ఆకుల శివకుమార్, ఇంద్ర మోహన్ గౌడ్, చౌదరి ప్రకాష్, వీరేశం, సాతాని శ్రీశైలం, శ్రీనివాస్, సత్యనారాయణ, మాడిశెట్టి ప్రకాశం, మల్లికార్జున శంకర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దిడీగి నాగేష్, కొత్త రమేష్, అశోక్, కిషన్, వినోద్ బిక్షపతి, శ్రీనివాస్, రేగళ్ల అశోక్, ఆర్యవైశ్య మహిళా భక్త బృందం, తదితర ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.