ఈడీ దూకుడు.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారంలో విచారణ వేగవంతం..

అక్రమ మైనింగ్ లో రూ. 300 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టారనే

Update: 2024-07-03 14:07 GMT

దిశ బ్యూరో, సంగారెడ్డి : అక్రమ మైనింగ్ లో రూ. 300 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టారనే ఆరోపణలతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇండ్లలో గతంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు విచారణలో వేగం పెంచారు. గతంలో సోదాలలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ లలో డేటాను సేకరించిన ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని ఓ బ్యాంక్ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు.

ఎమ్మెల్యే ఇండ్లలో సోదాలు నిర్వహించే సమయంలో బ్యాంకు లాకర్లకు సంబంధించిన పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో బ్యాంకు లాకర్లు ఉన్నట్టు గతంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు పట్టణంలోని పలు బ్యాంకు లాకర్లను ఈడీ అధికారులు తెరిచినట్లు స్పష్టమవుతుంది. బినామీ పేర్లతో ఉన్న లాకర్ల నుంచి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


Similar News