‘పర్యావరణ నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోండి’

పర్యావరణ నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని

Update: 2024-07-01 12:33 GMT

దిశ, గుమ్మడిదల: పర్యావరణ నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజల ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం కాజిపల్లి కిష్టాయి పల్లి ఆలీ నగర్ గండిగూడెం గ్రామాల్లో నెలకొన్న పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య వ్యర్ధ జలాల కారణంగా గాలి నీళ్లు పర్యావరణం పూర్తిగా కలుషితంగా మరి అనారోగ్య పాలవుతున్నామని ఆయా గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ పరిశ్రమలు కనీస పర్యావరణ నిబంధనలు కూడా పాటించకుండా తమ అనారోగ్య సమస్యకు ప్రధాన కారణమవుతున్నారంటూ సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి తమ సమస్యలను వివరించారు.

పర్యావరణం విషయంలో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమ గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం.. కలుషిత ప్రభావిత గ్రామాలకు మంజూర నీళ్లను అందించాలని కోరారు. అనంతరం టీజీపీసీబీ అధికారులను కలిసి పరిశ్రమల కాలుష్య సమస్యలపై వివరించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ ప్రజలు దండే రమాకాంత్, సయ్యద్ రయీస్, కుమార్ యాదవ్, అరికల మహేష్, మహమ్మద్ హుస్సేన్, అరికల సురేష్, యెనగండ్ల రాజు, ఆకుల కిరణ్, గద్దె బాలు, కొండా వెంకట్, వడ్ల భరత్, జేఏసీ కాజిపల్లి కమిటీ సభ్యులు నరేష్ ఆకుల, కుమ్మరి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News