రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం అని, రైతులకు పంద్రాగస్టు లోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు.

Update: 2024-06-29 12:30 GMT

దిశ, చిన్నశంకరంపేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం అని, రైతులకు పంద్రాగస్టు లోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర నూతన భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే రోహిత్, డిసిసి ఉమ్మడి జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి తో కలిసి భవనాన్ని ప్రారంభించారు. ఇంతకుముందు మండల పరిషత్ కార్యాలయంలో, అభివృద్ధి పనుల విషయమై, అధికారులు, ప్రజాప్రతినిధులతో ,సమీక్ష సమావేశం నిర్వహించారు.

కాగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. వచ్చే నెల నాలుగో తేదీ ఎంపీటీసీలు జడ్పీటీసీల కాలపరిమితి ముగియనుండడంతో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి దంపతులకు, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల కాలంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గ్రామాలలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు మళ్లీ వ్యవసాయం పండుగ కావాలనేదే సీఎం లక్ష్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ శాఖ సంచాలకులు విజయనిర్మల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, పిఏసిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, వైస్ చైర్మన్ మేడి నగేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమన్ రెడ్డి, రాజి రెడ్డి, మన్యం మైనంపల్లి రంగారావు, యాదవ రావు, పూలపల్లి యాదగిరి యాదవ్, ఎంపీడీవో దామోదర్, తాసిల్దార్ మన్నన్, ఇన్చార్జి ఎంఈఓ బుచ్చయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Similar News