గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 900 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం మూడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.

Update: 2024-06-26 15:03 GMT

దిశ, దౌల్తాబాద్: గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 900 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం మూడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఇందుప్రియల్ ఎక్స్ రోడ్ లో ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దొనపల్లి రాజు, పిట్ల నవీన్, తొర్రి దర్శన్ లను పట్టుకొని విచారించారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో హోటల్లు, కల్లు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో వారి కదలికలపై దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల్లో ఇతర ప్రదేశాలలో గంజాయి కలిగి ఉన్న విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నందుకు ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, సిబ్బందిని ఏసిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్సై రఘుపతి, ఏఎస్ఐ సాయిలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News