మాజీ సీఎం కేసీఆర్ తో…ఎమ్మెల్యేలు, బీఆర్ఎన్ నేతల భేటీ

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రెండవ రోజు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

Update: 2024-06-26 14:59 GMT

దిశ, ములుగు : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రెండవ రోజు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత సాయిచంద్ భార్య రజిని సమావేశానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణపై నేతలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Similar News