దిశ ఎఫెక్ట్ : అధికారుల స్పందన... సమస్య పరిష్కారం
గ్రామాల్లో ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరు వేరుగా స్వీకరించి డంపింగ్ యార్డ్ లో వేయాల్సి ఉండగా గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కనే పారబోస్తున్నారని గ్రామంలో ఎక్కడి సమస్య
దిశ,చిలిపిచెడ్ : గ్రామాల్లో ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరు వేరుగా స్వీకరించి డంపింగ్ యార్డ్ లో వేయాల్సి ఉండగా గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కనే పారబోస్తున్నారని గ్రామంలో ఎక్కడి సమస్య అక్కడే ఉందని పడకేసిన పారిశుధ్యం అనే కథనం దిశ,పత్రిక మంగళవారం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ కార్య నిర్వహణ అధికారి ట్రాక్టర్ డోజర్ సహాయంతో దుర్వాసన వెదజల్లుతున్న చెత్తను శుభ్రం చేశారు. గ్రామాల్లో నెలకొన్న మురికి కాలువను సైతం శుభ్రం చేయిస్తానని ఆమె తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన దిశ దినపత్రికకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.