అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-06-26 13:40 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అనురాధ నిందితుడి అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ గ్రామానికి చెందిన కుమ్మరి సాయికుమార్ వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. 2020 లో నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 దొంగతనం కేసులలో పోలీస్ అరెస్ట్ చేసి జైలుకి పంపారు. జైలు నుంచి వచ్చిన తరువాత తన దొంగ ప్రవృత్తి ని కొనసాగిస్తూ సుల్తాన్ బజార్, పెట్ బషీర్ బాగ్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి చెంచల్ గూడ, నిజామాబాదు, చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించాడు.

2022 సంవత్సరంలో జైలు నుండి విడుదల అయిన తర్వాత మళ్లీ వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తూ వాహనాలను వివిధ చోట్ల దాచిపెట్టి అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు. 2024 మార్చి 24వ ఉదయం సిద్దిపేట గణేష్ నగర్ లో తిరుగుతుండగా ఒక ఇంటి పార్క్ చేసిన బైక్ ను దొంగతనం చేశాడు. ఆ బైక్ ను అమ్మడానికి సిద్దిపేట మీదుగా వెళ్తున్న క్రమంలో అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించిన అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విచారణలో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సూర్యపేట, సిద్దిపేట దొంగలించినట్లు తెలిపాడు.

4 పల్సర్, 4 రాయల్ ఎన్ ఫిల్డ్, 9 కేటీఎం, హోండా యాక్టివా, హీరో హొండా వాహనాలు, రూ.45వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మోటార్ సైకిల్లు దొంగతనం చేసిన నేరస్తుని చాకచక్యంగా పట్టుకున్న వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీ బాబు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ నరసింహారావు, సీసీఎస్ సిబ్బంది యాదగిరి, కిషన్, సిద్దిపేట వన్ టౌన్ సిబ్బంది కనకరాజు, భూమలింగం, యాదగిరి, ఐటీ కోర్ కానిస్టేబుల్ శ్రీకాంత్ సీపీ అనురాధ అభినందించి త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ యస్ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు తదితరులు పాల్గొన్నారు.

Similar News