విస్తృతంగా వాహనాల తనిఖీలు…డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురిపై కేసు నమోదు

జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

Update: 2024-06-26 14:51 GMT

దిశ, కంది : జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం కంది చౌరస్తా వద్ద రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 5 మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నట్లు సీఐ చెప్పారు. ఈ తనిఖీల్లో రూరల్ ఎస్సై వినయ్ కుమార్, ఇంద్రకరణ్ ఎస్సై విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Similar News