డ్రైవర్లు లేక నిలిచిపోయిన బస్సులు..

ఆర్టీసీ డిపో ఏర్పాటు అయితే తమ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ప్రయాణికులు భావించారు.

Update: 2024-06-18 13:05 GMT

దిశ, నర్సాపూర్ : ఆర్టీసీ డిపో ఏర్పాటు అయితే తమ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ప్రయాణికులు భావించారు. డిపో ఏర్పాటైన నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రయాణికుల సమస్యలు రెట్టింపు అయ్యాయి. వివరాల్లోకెళితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో నర్సాపూర్ నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో మంజూరు అయింది. అప్పటి ప్రభుత్వం సుమారు 10 కోట్ల వ్యయంతో డిపో నిర్మాణం చేపట్టారు. మొదట పది బస్సులతో ప్రారంభమైన డిపో ఇప్పుడు 26 బస్సులకు చేరింది. వీటిని ప్రయాణికులకు అవసరమున్న చోట రూట్ లో ఆర్టీసీ అధికారులు బస్సులను రాకపోకలు సాగిస్తున్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి డ్రైవర్లు కండక్టర్ల కొరతతో ఐదారు బస్సులు వృధాగానే ఉంటున్నాయి. హైదరాబాద్ బస్సులకు డ్రైవర్లు కండక్టర్ లు లేకపోవడంతో ఉన్న బస్సులలో రద్దీ ఎక్కువై ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నకండక్టర్లకు, డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు డబల్ డ్యూటీ నెట్టుకొస్తున్నారు.

పాత బస్సులతోనే..  

అయితే ఆర్టీసీ డిపో ప్రారంభ సమయంలో నర్సాపూర్ డిపోకు కొత్త బస్సులు వస్తాయని అందరూ భావించారు. ప్రభుత్వం మారినా ఇంతవరకు కొత్త బస్సులు రాలేదు. అయితే నర్సాపూర్ డిపో లాభాల బాటలో ఉందని రాష్ట్రస్థాయిలో ఆదాయంలో ఆరవ స్థానం ఉందని అప్పట్లో అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఇటీవల జిల్లా కేంద్రమైన మెదక్ డిపోకు 22లో నూతన బస్సులు వచ్చాయని అందులో కేవలం ఒక బస్సును నర్సాపూర్ డిపోకు కేటాయించినట్లు తెలిసింది. నర్సాపూర్ డిపోలో మాత్రం కొన్ని కాలం చెల్లిన బస్సులతో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి కాలం చెల్లిన బస్సులను రోడ్డు బాగాలేని నర్సాపూర్ వయా షేర్ ఖాన్ పల్లినాగారం పటాన్చెరువు రోట్లో నడిపించడం వల్ల రాకపోకలు సాగించే ప్రయాణికులు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

డిపో ఏర్పాటైన తప్పని తిప్పలు

అయితే నర్సాపూర్ డిపో ఏర్పాటు అయిందని సమస్యలు తొలగిపోతాయని ఈ ప్రాంత వాసులు మొదట్లో సంబరపడిపోయారు. అయితే నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ కు నిత్యం వేలాదిమంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రయాణికులు, రైతులు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ లేక ఇబ్బందులు

అయితే నర్సాపూర్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ లేకపోవడంతో ఇక్కడ బస్సు ఎక్కే వారికి సీటు దొరకక గంటల తరబడి నిలుచొని ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జీడిమెట్ల డిపోకు చెందిన బస్సులు నర్సాపూర్ నుంచి బాలనగర్ బాలనగర్ నుంచి నర్సాపూర్ కు బస్సులో నడిచేవి. నరసాపూర్ ప్రాంత వాసులకు రాకపోవలు సాగించడానికి వీలుగా సీటు దొరికేది. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సరిపడా డ్రైవర్లు కండక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ లకు స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉండే విధంగా బస్సులను నడపాలని కోరుతున్నారు.

డ్రైవర్లు కండక్టర్ ల కొరత ఉన్న విషయం వాస్తవం..

ఇదే విషయమై నర్సాపూర్ ఆర్టీసీ డిపో సూపర్డెంట్ లక్ష్మన్ ను వివరణ కోరగా డిపోలో కండక్టర్లు డ్రైవర్లు కొరత ఉన్న విషయం వాస్తవమేనని ఉన్నతాధికారులకు విషయం తెలిపామని అన్నారు.

Similar News