'ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు'

ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని కాంగ్రెస్ నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు.

Update: 2024-06-18 12:59 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని కాంగ్రెస్ నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11న చిన్నకోడూరు మండలం పరిధిలో జరిగిన ఓ వృద్దురాలి మృతి కేసులో విచారణ సాగుతున్న తీరును తప్పుబట్టారు. ఈ కేసులో నింధితుడిగా ఉన్న చంద్రశేఖర్ పేరిట తనతల్లి (మృతి చెందిన వృద్దురాలు) 2022లోనే ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిందని ఆస్తీ తగాదాలు లేవన్నారు.

ఆస్తి విషయంలో దాయాదుల మధ్య వివాదం కొనసాగుతుండగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఇదిలా ఉంటే తన పై ఉన్న కక్ష్యతో కొందరు పోలీసులు తన అనుచరుడిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో అనుమానాలు ఉన్నాయని థర్డ్ పార్టీ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లి నిష్పాక్షిక విచారణ జరిగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. కేసులు చక్రధర్ గౌడ్ కు కొత్త కావని చట్టప్రకారం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Similar News