అసెంబ్లీ ఆవరణలో తీన్మార్ మల్లన్నతో మల్లారెడ్డి ఆసక్తికర సంభాషణ

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Update: 2023-12-15 09:43 GMT
అసెంబ్లీ ఆవరణలో తీన్మార్ మల్లన్నతో మల్లారెడ్డి ఆసక్తికర సంభాషణ
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో అసెంబ్లీ ఆవరణ అంత నాయకులతో సందడిగా మారింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే.. ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి నవ్వుతూ అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్‌కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. కచ్చితంగా మద్దతు ఇస్తానని మల్లారెడ్డి సమాధానం చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తర్వాత అందరం ఒక్కటేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News