డీలిమిటేషన్ విధివిధానాలే ఇంకా ఫైనల్ కాలేదు.. తమిళనాడు సమావేశంపై కిషన్ రెడ్డి విమర్శలు

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని చెన్నై వేదికగా జరిగిన దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), డీఎంకేవి(DMK) దిగజారుడు రాజకీయాలు అని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం డీలిమిటేషన్(Delimitation)తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు డీలిమిటేషన్ విధివిధానాలే ఇంకా కాలేదు.. అప్పుడే దేశంలో దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశాన్నే విభజించేలా కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం(DMK Govt)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ కుట్రకు ప్లాన్ చేశారని విమర్శించారు. అంతేకాదు.. ఈ సమావేశంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువైందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి డీలిమిటేషన్‌తో అన్యాయం జరుగదని.. అలాగే చట్టం రూపొందిస్తామని చెప్పారు. దక్షిణ భారత్‌పై ప్రధాని మోడీకి ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. బీజేపీపై విషం కక్కడమే కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ ప్లాన్ అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్(Delimitation)పై హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరుగబోతోంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ అవుతారు. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 15వ తేదీన నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు.