భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మాదినేని ఉష రాణి

భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మండలానికి వన్నె తెచ్చారు

Update: 2025-03-15 04:57 GMT

దిశ, ఏన్కూర్: భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మండలానికి వన్నె తెచ్చారు మాదినేని ఉష రాణి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలోని మాదినేని ఉష రాణి వృత్తిరీత్యా గృహిణి, వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఉషారాణి మైసూర్ దత్త పీఠం వారు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కంఠస్థం చేసి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సాధారణ గృహిణి అయిన ఉష రాణి ఇంటి పనులు పూర్తయిన తర్వాత నిత్యం భగవద్గీత పై పట్టు సాధించేందుకు కృషి చేయడం జరిగింది. పదో తరగతి వరకు చదివిన ఉష, భగవద్గీతలో పట్టు సాధించటం అందరికీ సాధ్యం కాదని పలువురు పేర్కొనడం విశేషం, కామేపల్లి మండలం జాస్తి పల్లి గ్రామంలో జన్మించిన ఉష రాణి , భర్త మాదినేని అశోక్ సహకారంతో భగవద్గీత పోటీలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి కోపేల శ్యామల, జిల్లా టిడిపి నాయకులు తాళ్లూరి అప్పారావు, గ్రామస్తులు తదితరులు అభినందించారు.


Similar News