జీతం రామగుండంలో.. ఉద్యోగం మణుగూరులో..
మణుగూరు మున్సిపాలిటీలో జేఏఓ గా ఉద్యోగం చేస్తూ రామగుండం ప్రాంతంలో

దిశ, మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీలో జేఏఓ గా ఉద్యోగం చేస్తూ రామగుండం ప్రాంతంలో పనిచేస్తున్నట్లుగా జీతం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మూడేళ్ల క్రితం మణుగూరు మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. తర్వాత రామగుండం మున్సిపాలిటీలో ఏ-గ్రేడ్ ఏఓగా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ వద్దునుకుని డిప్యూటేషన్‌పై మళ్లీ మణుగూరు మున్సిపాలిటీలో పని చేయడం గమనార్హం. రామగుండం మున్సిపాలిటీ వాళ్లు మణుగూరులో పనిచేసే ఏఓ తమ కార్యాలయానికే కావాలని వెంటనే జేఏవోను బదిలీ చేయాలని వరంగల్ సీడీఏంఏకు లేటర్ పెట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ సీడీఎంఏ అధికారులు స్పందించి మణుగూరు మున్సిపాలిటీలో పనిచేసే జేఏవోను రామగుండం బదిలీ చేయాలనీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జేఏఓ కొంతమంది అధికారులకు ముడుపులు ముట్టజెప్పి రామగుండం వెళ్లకుండా మణుగూరుకే డిప్యూటేషన్‌పై పోస్టింగ్ తెచ్చుకోవడం సంచలనంగా మారింది. ఆర్డర్స్ వచ్చిన ఒక్క రోజులోనే జేఓ ముడుపులతో అధికారులను కప్పి పెట్టాడని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
సస్పెండైన వారిని కాపాడేదెవరు?
మణుగూరు మున్సిపాలిటీలో పనిచేసే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను స్థానికంగా ఉన్న ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు, మరో స్థానిక బడా వ్యాపారవేత్త కాపాడుతున్నారని వినపడుతోంది. వరంగల్ సీడీఎంఏ కార్యాలయంలో కొందరు అధికారులతో లావాదేవీల లింకులు పెట్టుకోవడంతోనే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీలు జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక దగ్గర సస్పెండై వచ్చి, పదేళ్లు ఒకే మున్సిపాలిటీ ఆఫీస్‌లో పని చేసిన ఈ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఎంక్వైరీకి వచ్చిన వారికి బహుమతులు..?
కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అధికారులు తెలుసుకొని ఎంక్వయిరీపై కార్యాలయానికి వస్తే ఆఫీస్ లో ఉండే కొందరు వ్యక్తులు అధికారులకు మంచి నాటుకోడితో విందు ఏర్పాటు చేసి, కొంత నగదును కూడా ముట్టజెప్పుతారని వినికిడి వినిపిస్తోంది.చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి,బదిలీలు చేయకుండా అధికారులను మచ్చిగా చేసుకోవడానికే కార్యాలయంలో ఉండే కొందరు వ్యక్తులు ఆ దిశగా పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సీడీఎంఏ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ల అధికారులను, డిప్యూటేషన్‌పై ఉన్న జేవోను వెంటనే బదిలీ చేయాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుతున్నారు.