శిధిలావస్థలో ఉన్న ఎన్ఎస్పీ భవనాలను కూల్చరా..?

ఆయన జిల్లాకి ప్రథమ పౌరుడు. ఆయన మాటంటే జిల్లా అధికారులు అమలు

Update: 2025-03-21 03:16 GMT
శిధిలావస్థలో ఉన్న ఎన్ఎస్పీ భవనాలను కూల్చరా..?
  • whatsapp icon

దిశ, ఏన్కూర్: ఆయన జిల్లాకి ప్రథమ పౌరుడు. ఆయన మాటంటే జిల్లా అధికారులు అమలు జరపాలి. అలాంటి అధికారి మాటలను పెడచెవిని పెట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి..ఏనుకూరు మండల కేంద్రంలోని స్థానిక ఎన్ఎస్పీ క్వార్టర్స్ ప్రాంగణంలో గత 40 ఏళ్ల క్రితం సాగర కాలువ నిర్మాణం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్వాటర్స్ శిధిలావస్థకు చేరాయి. వీటి ఆలనా పాలన పట్టించుకునే నాధుడే కరువవడంతో అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ప్రస్తుతం ఈ ఎన్ ఎస్ పి ప్రాంగణంలో తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగుతుంది. ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులు ఆదమరిచి ఎన్ఎస్పీ క్వార్టర్స్ వైపు వెళితే భవనాలు శిథిలావస్తలో ఉండటంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది.

ఇటీవల కాలంలో ఏనుకూరు మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, తెలంగాణ గురుకుల పాఠశాల సందర్శించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు విద్యార్థులంటే అమితమైన ప్రేమ, ఒకానొక సందర్భంలో విద్యార్థుల కోసం సమయం వెచ్చించి ఉపాధ్యాయుడుగా అవతారమెత్తి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడటానికి మెలుకువలు నేర్పటం జరగడంతో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అంటే జిల్లాలోని ఏ పాఠశాల విద్యార్థులైన సంబరపడతారు. ఏనుకూరు గురుకుల పాఠశాల సందర్శన సమయంలో శిధిలావస్థలో ఉన్న ఉన్న బిల్డింగులను తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించినప్పటికీ నేటి వరకు అధికారులు అలాంటి చర్యలు ఏమి చేపట్టకపోవడంతో, జిల్లా కలెక్టర్ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారా, అనే అనుమానం తలెత్తుతుంది,

పాఠశాలకు వరాలు కురిపించిన జిల్లా కలెక్టర్..

తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా పాఠశాలకు 20 టాయిలెట్స్, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, విద్యార్థులు తలదాచుకునేందుకు డార్మెటరీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపమని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యత సంపాదించేందుకు 25 వేల రూపాయలు తక్షణమే చెక్కు రూపంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి కి అందించడం జరిగింది. విద్యార్థుల ఎలాంటి ప్రమాదం జరగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల ప్రాంగణంలో ఉన్న శిధిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే తొలిగించాలని, జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు పరచాలని స్థానికులు సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు కోరుతున్నారు.


Similar News