ప్రమాదవశాత్తు రైలుబండి నుంచి జారిపడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు రైలు బండి నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మధిర సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, మధిర : ప్రమాదవశాత్తు రైలు బండి నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మధిర సమీపంలో చోటు చేసుకుంది. మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్ వేణుగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంద్రజిత్ ( 41) అనే వ్యక్తి మధిర తొండలగోపారం స్టేషన్ ల మధ్య రైలు బండి నుంచి జారిపడి ప్రమాదవశాత్తు మరణించినట్టుగా తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఇంద్రజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్కే ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరిచారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.