దాడి కేసులో వ్యక్తికి ఏడాది జైలు

దాడి కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు.

Update: 2025-03-26 15:57 GMT
దాడి కేసులో వ్యక్తికి ఏడాది జైలు
  • whatsapp icon

దిశ, సిరిసిల్ల రూరల్ : దాడి కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ కి చెందిన అంకరపు ప్రభాకర్ 2017 ఏప్రిల్ 4న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని పక్కన ఉన్న ఇంటి టులెట్ బోర్డును తీసి కాముని వనిత, కాముని అరుణ, వడ్డేపల్లి సుజాతపై కర్రతో దాడి చేశాడు.

    కాముని వనిత సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల ఏఎస్ఐ అనంతరెడ్డి ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి ఎండి. లియకత్ అలీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నరేష్ కోర్టులో పది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల సందీప్ వాదించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎ.ప్రవీణ్ నేరం రుజువు కావడంతో నిందితుడు ప్రభాకర్ కి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించినట్లు సిరిసిల్ల సీఐ కె.కృష్ణ పేర్కొన్నారు.

Similar News