ఔటర్ రింగ్ రోడ్డుపై రెప్పపాటులో ప్రమాదం
కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

దిశ, కీసర : కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి మంచిర్యాలకు కారులో కొందరు వెళ్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ అందే విజయ్ కీసర సమీపంలోకి రాగానే ఔటర్ రింగ్ రోడ్డుపై పక్కకు కారు ఆపి కిందికి దిగేందుకు డోరు తీయగా వెనకాల నుండి వేగంగా వచ్చిన కంటైనర్ విజయ్ను ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన విజయ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.