యాదాద్రిలో బోర్డు తిప్పేసిన ప్రముఖ జ్యూవెలర్స్.. పట్టుబడిన నిందితులు
యాదగిరిగుట్టలో కొద్ది రోజుల క్రితం బోర్డు తిప్పేసిన జై భవాని జ్యూవెలర్స్ నిర్వాహకులను పోలీసులు ఈ రోజు పట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: యాదగిరిగుట్టలో కొద్ది రోజుల క్రితం బోర్డు తిప్పేసిన జై భవాని జ్యూవెలర్స్ నిర్వాహకులను పోలీసులు ఈ రోజు పట్టుకున్నారు. నమ్మకంగా ఉండే ఈ షాప్ నిర్వాహకుల వద్ద స్థానిక ప్రజలు తమ బంగారం, వెండి ఆభరణాలు తాకట్టు పెట్టారు. అయితే పెద్ద మొత్తంలో తాకట్టుకు వచ్చిన ఆభరణాలతో జై భవాని జ్యూవెలర్స్ నిర్వాహకుల ఉడాయించారు. అలాగే స్థానిక ప్రజల తాకట్టు పెట్టిన బంగారం, వెండి ఆభరణాలు.. ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. కాగా బాధితుల జ్యూవెలర్స్ బోర్డు తిప్పేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం ఈ రోజు నిందితులు జితేందర్ లాల్, మధు, రాములును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే పట్టుబడిన నిందితుల నుంచి ఒక కిలో 180 గ్రాముల బంగారం, 64 కిలోల వెండి రికవరీ చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.