తెలంగాణలో పేదలకు ఇక నుంచి శ్రీమంతులు తినే బియ్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం(Rich Rice) తింటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు....

Update: 2025-03-30 13:54 GMT
తెలంగాణలో పేదలకు ఇక నుంచి శ్రీమంతులు తినే బియ్యం: సీఎం రేవంత్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం(Rich Rice) తింటారని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం(Fine Rice) పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజూ పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి 90 పైసలకే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని దివంగత నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao) కూడా కొనసాగించారని గుర్తు చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజా పంపిణీ విధానం ఉందన్నారు. ఏడు దశాబ్దాల క్రితమే పీడీఎస్‌ను కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్పారు. దొడ్డు బియ్యాన్ని ఇస్తే చాలా మంది తినడం లేదని, మిల్లర్ల మాఫియాలోకి వెళ్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దొడ్డు బియ్యంతో ప్రతి సంవత్సరం రూ. 10 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదవాడు ప్రతి రోజూ సన్నబియ్యం తినాలనేదే తమ ఆలోచన అని చెప్పారు. పేదల కోసం సోనియా గాంధీ(Sonia Gandhi) ఆహారభద్రతా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో పేదల ఆకలిని తీర్చిన తల్లి సోనియమ్మ అని తెలిపారు. సన్న బియ్యం ఆలోచన గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

Tags:    

Similar News