ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ కోర్సులకు న్యూ లిటిల్ ఫ్లవర్ ఎంపిక

చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న వివిధ రకాలైన కోర్సులను విద్యార్థులకు అందించుటకు వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలను ఎంపిక చేస్తున్నామని ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ ప్రకటించారు.

Update: 2025-03-22 11:17 GMT
ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ కోర్సులకు  న్యూ లిటిల్ ఫ్లవర్ ఎంపిక
  • whatsapp icon

దిశ, వైరా: చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న వివిధ రకాలైన కోర్సులను విద్యార్థులకు అందించుటకు వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ కళాశాలను ఎంపిక చేస్తున్నామని ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ ప్రకటించారు. తమ పాఠశాలను ఐఐటీ కోర్సులకు ఎంపిక చేసిన మద్రాస్ యూనివర్సిటీ నిర్వాహకులకు కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమేశ్వరరావు మాట్లాడారు.

ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ వారు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ లో భాగంగా విద్యార్థులు భవితకు బంగారు బాటలు వేయుటకు అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అయిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి ప్రోగ్రామ్స్ కి సంబంధించిన శిక్షణను కాలేజి విద్యార్థులకు 8 వారాల పాటు ఇచ్చేందుకు అంగీకార పత్రం ఇచ్చారన్నారు. ఈ 8 వారాల శిక్షణ తరగతులతో విద్యార్థులలో సాంకేతిక పరమైన నైపుణ్యాలు పెరిగి, ఇంజనీరింగ్ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. దేశంలో అత్యున్నత సంస్థల సౌజన్యంతో శిక్షణ పొందడం వైరా ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశం అని వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కాపా మురళీ కృష్ణ, కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకరరావు, ప్రిన్సిపల్స్ పి. భువన ప్రసాద్, షాజీ మాథ్యూ , ఎఓ సామినేని నరసింహారావు, విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News