జర్నలిస్టులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి వనమా

జర్నలిస్టుల న్యాయమైన కోరికను ప్రభుత్వం నెరవేర్చాలని, వారికి ఇండ్ల స్థలం ఇచ్చేదాక అండగా ఉంటామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,

Update: 2025-03-25 12:23 GMT
జర్నలిస్టులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి వనమా
  • whatsapp icon

దిశ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణం, మార్చి 25 : జర్నలిస్టుల న్యాయమైన కోరికను ప్రభుత్వం నెరవేర్చాలని, వారికి ఇండ్ల స్థలం ఇచ్చేదాక అండగా ఉంటామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సీపీఐ ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని నాగేశ్వర్ రావు, జై భీం రావ్ భారత్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ లు హామీ ఇచ్చారు. కార్పోరేట్ కంపెనీలకు నామమాత్రపు రేట్ కే ఎకరలకేకరాలు అప్పగిస్తూ , నిత్యం ప్రజా సంక్షేమం కోసం, పీడిత ప్రజల కోసం పని చేస్తూ చాలిచాలని వేతనంతో బ్రతుకులీడుస్తున్న జర్నలిస్టులు ఇండ్ల స్థలం కోసం కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని అన్నారు.

ఇండ్ల స్థలాలు సాధించడమే ధ్యేయంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన జర్నలిస్టులు ఎప్పుడు ఏ పిలుపునిచ్చిన తమంత వెంట నిలుస్తామని ముక్త కంఠంతో స్పష్టం చేశారు. నిరుపేదలైన జర్నలిస్టులు 200 గజాల స్థలం కోసం కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఉచితంగా ఇస్తూ , సమాజ బాగు కోసం అనునిత్యం పనిచేస్తున్న వారికి ఉచితంగా కాకుండా కోట్ల రూపాయలు చెల్లించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే గతంలో ఇచ్చిన జీవో ను రద్దు చేసి నామ మాత్రపు రేట్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, అడ్వకేట్ లు మరపాక రమేష్, హరి, సంకుబాపన అనుదీప్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

అమరవీరులకు నివాళి

జర్నలిస్టు ల ఇండ్ల స్థలాల సాధన నిరసన కార్యక్రమంలో భాగంగా 6వ రోజు స్థానిక బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల ప్రతినిధులు, స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు పాల్గొన్నారు.


Similar News