నవోదయ పరీక్ష ఫలితాల్లో ఉషోదయ విద్యార్థి ప్రతిభ..

ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ఏన్కూర్ లోని ఉషోదయ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న డి.జస్వంత్ రామ్ అనే విద్యార్థి అత్యంత ప్రతిభను కనబరిచి నవోదయ సీటు సాధించాడు.

Update: 2025-03-26 02:24 GMT
నవోదయ పరీక్ష ఫలితాల్లో ఉషోదయ విద్యార్థి ప్రతిభ..
  • whatsapp icon

దిశ, ఏన్కూరు : ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ఏన్కూర్ లోని ఉషోదయ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న డి.జస్వంత్ రామ్ అనే విద్యార్థి అత్యంత ప్రతిభను కనబరిచి నవోదయ సీటు సాధించాడు. ఇదే పాఠశాల నుండి గత సంవత్సరం సుఖ భోగి ఉదయతేజ అనే విద్యార్థి సైనిక పాఠశాలలో సీట్ సాధించడం విశేషం. దీంతో పాటు పట్టణ ప్రాంతానికి దీటుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉషోదయ పాఠశాల నుండి గత 20 సంవత్సరాలుగా వందల మంది విద్యార్థులను ఒకవైపు గురుకుల పాఠశాల, మరోవైపు సైనిక, నవోదయ పాఠశాలలో సీట్లు సాధించే విధంగా కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మండల ప్రజలు అభినందిస్తున్నారు. తాజాగా సీటు సాధించిన జస్వంత్ రామ్ ను తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కే.వెంకటేశ్వరరావు, ఏవో నరసింహారావు ఉపాధ్యాయులు శ్యామ్, శారద, ఐశ్వర్య, తేజ, మణి, రాము తదితరులు పాల్గొన్నారు.

Similar News