శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో చోరీ..
వరుస దొంగతనాలతో మధిర మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

దిశ,మధిర : వరుస దొంగతనాలతో మధిర మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దేవాలయాలని టార్గెట్ చేసుకొని దొంగలు ఆలయాల్లో లోనే దేవతామూర్తుల ఆభరణాలు, హుండీలోని నగదును చోరీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మండల పరిధిలోని సిరిపురం గ్రామం శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయం గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, ఆలయంలోనే హుండీ తాళం పగులగొట్టి దానిలోనే నగదు అపహరణ, అమ్మవారి వెండి కిరీటాన్ని వస్తువులను దొంగిలించినట్లు, అంతేకాకుండా సీసీ కెమెరాల ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను తీసుకుని వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆలయ అర్చకులు రామకృష్ణ గురువారం ఉదయం ఆలయానికి చేరుకొనగా దేవాలయం డ్రిల్స్ కి వేసిన తాళం పగులగొట్టి తెరిచి ఉండడంతో పాటు, ఆలయంలో హుండీ లోనే నగదు, దేవతామూర్తుల వెండి కిరీటం వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించి ఈ విషయాన్ని గ్రామస్తులకు, ఎండోమెంట్ ఉన్నత అధికారులకు ,మధిర రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా రూరల్ ఎస్సై బి లక్ష్మీ భార్గవి సంఘటనా స్థలానికి చేరుకొని దేవాలయ పరిసరాలను పరిశీలించారు.