ఏనుకూరులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మైకులు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే అధికారులు.
దిశ, ఏన్కూర్ : పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మైకులు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే అధికారులు. డ్రైనేజీ వ్యవస్థ పై ఎలాంటి శ్రద్ధ వహించక పోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. ఏనుకూరు మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. దోమల నివారణ కోసం పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎలాంటి చర్యలు ఏమి లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ప్రజలకు దోమల వల్ల కంటి మీద నిద్ర లేకుండా పోతుంది. ఒకవైపు దోమల స్వైర్య విహారం చేస్తే మరోవైపు అస్పత్రి పాలవుతూ డబ్బులు వదిలించుకోవడం జరుగుతుంది. తగినంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ.. స్థానిక పంచాయతీ అధికారులు డ్రైనేజీ వ్యవస్థ పై ఎందుకు శ్రద్ధ వహించడం లేదని స్థానికులు పంచాయతీ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోమల నుంచి రక్షించాలని, ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని, పంచాయతీ అధికారులు ను గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.