నాడు కల కల.... నేడు వెలవెల.. సీఎల్ఆర్సీ భవనానికి పూర్వ వైభవం వచ్చేనా..?

జిల్లాలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన క్రింది స్థాయికి సిబ్బందికి

Update: 2025-03-19 04:34 GMT
నాడు కల కల.... నేడు వెలవెల.. సీఎల్ఆర్సీ భవనానికి పూర్వ వైభవం వచ్చేనా..?
  • whatsapp icon

దిశ, ఏన్కూర్ : జిల్లాలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన క్రింది స్థాయికి సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు గాను నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎల్ఆర్సీ భవనాన్ని క్లస్టర్ స్థాయి రిసోర్స్ సెంటర్, నిర్మాణం చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భవనంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డీఆర్డీఏ పరిధిలో ఉన్న వివిధ శాఖల అధికారులకు సీఎల్ఆర్సీ భవనంలో రెండు మూడు రోజులు శిక్షణలో ఇవ్వడం జరిగేది. ఈ భవనం నిర్మాణం కోసం ఆనాటి ప్రభుత్వం సుమారు 20 లక్షల రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. శిక్షణ జరిగే సమయంలో ఆనాటి కలెక్టర్లు నిత్యం సిఎల్ఆర్సి భవనానికి వస్తూ పోతూ ఉండేవారు. ఈ కేంద్రం నిర్వహణ కోసం సీఆర్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ జరిపేవారు. వాటర్ షెడ్, మండల పరిషత్ సిబ్బంది, విద్యాశాఖ, ఉపాధి హామీ సిబ్బందికి, డ్వాక్రా మహిళలు సైతం శిక్షణను ఇచ్చే సమయంలో ఈ భవనం కలకలలాడుతూ ఉండేది. కాలక్రమేన డీఆర్డీఏ శాఖ ఈ భవనం నిర్వహణ గురించి పట్టించుకోక పోవడంతో, దీని తాళాలు తీసే నాథుడే కరువయ్యారు.

ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం టీటీడీసీ తర్వాత ట్రైనింగ్ శిక్షణ కేంద్రం ఏన్కూరు సీఎల్ఆర్సీ భవనంలోనే జరిగేవి, సుమారు మూడు సంవత్సరాల నుండి ఈ భవనం తాళాలు తెరిచేవారు లేక చెత్త చెదారంతో భవనం ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఇదే కార్యాలయంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని ఎక్కడకి తరలించారో సిబ్బందికే తెలియదంటే ఆశ్చర్య పోవాల్సిందే. ప్రస్తుతం వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలు నిత్యం పనులు నిమిత్తం పని ప్రదేశానికి వెళ్లి రావడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉందంటే అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కి చెబుదామని వస్తే తాళాలు వేసి కార్యాలయం మూసి ఉండటంతో వెనుతిరిగి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం జరిపిన భవనాలు తాళాలు తీర్చే నాధుడే లేక వాటి నిర్వహణ బాధ్యతలు మరిచి డీఆర్డీఏ శాఖ అధికారులు ఏం పని చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా ఈ భవనం డీఆర్డీఏ ఆధీనంలో ఉందా, లేక మరి ఇతర శాఖలకైనా అప్పగించారా అనేది తెలియాల్సి ఉంది జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి, సీఎల్ఆర్సీ భవనానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News