రాజన్న ఆలయంలో జరుగుతున్న అవినీతి పై ఫోకస్ పెట్టిన సీసీఆర్ సంస్థ..

కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రెటరీ నెవురి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Update: 2024-06-18 15:24 GMT

దిశ, వేములవాడ : కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రెటరీ నెవురి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగుల పై సీసీఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. దీనిలో ప్రధానంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో గత పది సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు ఇక్కడే నిర్వహించడం, తప్పుడు సర్టిఫికెట్స్ సృష్టించి ఏఈఓ గా పనిచేస్తున్నారని ఆరోపించారు.

ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని, విజిలెన్స్ కేసులు ఉన్నవారిని ఈ ఆలయంలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వారికి పదోన్నతి ఇచ్చుట ఇలా దేవాలయంలో అక్రమాలకు అడ్డాగా మారిందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి సీసీఆర్ సంస్థ తరఫున ఆరోపణ చేశామని, ఆలయ ఉద్యోగుల పైన ఖచ్చితమైన విచారణ చేపట్టగలరని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు, టెండర్ ప్రక్రియలకు సంబంధించిన అంశాల పైన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించబడటం లేదని, కావున ఆలయ ఉద్యోగుల పైన సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షించగలరని సీసీఆర్ సంస్థ తరఫున కోరుకుంటున్నామని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం గమనార్హమని అన్నారు. ఇప్పటికైనా ఆలయ ఉద్యోగుల పై తక్షణమే దేవదాయ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు నెవూరి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు, ఈసంపల్లి సంతోష్, కొక్కు గోపాలకృష్ణ, చౌటపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News