గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం : జిల్లా ఎస్పీ

గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని

Update: 2024-06-26 15:32 GMT

దిశ,జగిత్యాల టౌన్ : గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా ఎస్పీ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి స్టూడెంట్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం ను పురస్కరించుకొని డ్రగ్స్ కు యువత బానిస కావద్దని, డ్రగ్స్ ను వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై దిశా నిర్దేశం చేశారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలని, పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు , డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు ఎక్సైజ్ అధికారులు, ఇతర శాఖ అధికారులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Similar News