జగిత్యాల యావర్ రోడ్డుకి మున్సిపల్‌లో తీర్మానం.. ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు

జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో పలు వార్డుల సమస్యలపై

Update: 2024-06-29 13:58 GMT

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో పలు వార్డుల సమస్యలపై చర్చతో పాటు మున్సిపల్ ఏజండా, అదనపు ఏజండా పాస్ చేశారు. జగిత్యాల పట్టణ యావర్ రోడ్ 100 ఫీట్ల రోడ్ విస్తరణ అంశాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి సమక్షంలో మున్సిపల్ అదనపు ఏజండా లో పొందుపరచగా కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. సమావేశం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణ మున్సిపల్ అదనపు ఎజెండా లో పొందు పరిచగా కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించడానికి 70 కోట్లు అవసరం పడుతుందని అంతా బడ్జెట్ మున్సిపల్ లో లేదన్నారు. దీనికి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అన్నారు. తాను కూడా సీఎం తో మాట్లాడి నిధులు మంజూరు అయ్యేలా చేయిస్తానని తెలిపారు. ఇంటి ఇంటికి మంచినీరు సౌకర్యం కల్పించడం, అమృత్ స్కీం మీద 28 కోట్లు మంజూరు కాబడిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిందన్నారు. దీనికోసం పట్టణంలో ఇంకా మూడు కొత్త వాటర్ ట్యాంక్ హెడ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం యావర్ రోడ్డు విస్తరణ కోసం 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు.

Similar News