లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ అధ్యక్షుడిగా కటకం శ్రీనివాస్

వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ, లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ రాజన్న (320జి) ఇన్స్టాలేషన్ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది.

Update: 2024-07-01 08:38 GMT

దిశ,వేములవాడ:వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ, లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ రాజన్న (320జి) ఇన్స్టాలేషన్ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఇన్స్టాలేషన్ అధికారి అనంతుల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ నూతన అధ్యక్షుడిగా కటకం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తానని, అందరి సభ్యుల సహకారంతో క్లబ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఇదిలా ఉండగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ కు అభినందనల వర్షం కురిసింది. ఆయన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో, డప్పుచప్పుల్లు, టపాసుల మోతల మధ్య పండగ వాతావరణంలో శ్రీనివాస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మరోవైపు క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికవడం పట్ల పట్టణానికి చెందిన రాజకీయ, వ్యాపార, సామాజిక, విద్య, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Similar News