జడ్జిలు, సెలబ్రెటీలు, పొలిటిషియన్స్ ఫోన్లు ట్యాప్.. సంచలన విషయాలు వెల్లడించిన సిట్..!

తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హై కోర్టులో దాఖలు చేసిన కౌంటర్

Update: 2024-07-03 17:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హై కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో పోలీసులు సెన్సేషనల్ విషయాలను పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు, పొలిటిషియన్స్, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లును కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశామని, ఈ నలుగురి ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించారు. మీడియాకు చెందిన ఓ యాజమాని ఇంట్లో కూడా తనిఖీలు చేశామని అఫిడవిట్‌లో పొందుపర్చారు. పరారీలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఇంట్లో తనిఖీలు చేసి 42 వస్తువులను సీజ్ చేశామని పేర్కొన్నారు.

మార్చి 23న ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా.. ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడన్నారు. ఆధారాలు దొరక్కుండా అన్ని జాగ్రత్తులు తీసుకున్నాడన్నారు. ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు టీమ్‌లోని 10 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశామని వెల్లడించారు. అట్లాస్ టూల్ సహయంతో ప్రొఫైల్స్ మానిటర్ చేశారని పేర్కొన్నారు. మూసీ నుండి హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నామని, కానీ ఆ హార్డ్ డిస్క్ శకలాల్లో ఎలాంటి డేటా గుర్తించలేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉందని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన హై కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. హై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో పైన పేర్కొన్న విషయాలను వెల్లడించారు.


Similar News