చిన్న కొత్తపల్లిలో విచిత్రం.. మెడిచెట్టుకు పారుతున్న కల్లు

ఈత, తాటి, ఖర్జూర చెట్లకు కల్లు పారడం చూశాం.

Update: 2024-07-06 03:57 GMT

దిశ, కొల్లాపూర్: ఈత, తాటి, ఖర్జూర చెట్లకు కల్లు పారడం చూశాం. కానీ, మెడి చెట్టుకు గౌడన్న గీత గీయడం‌తో కల్లు పారుతున్న అనూహ్య ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్త పల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేందర్ వృత్తిరీత్యా గీతా కార్మికుడు. అయితే, ప్రతిరోజు తాళ్లు ఎక్కి గ్రామంలో కల్లును విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆతడి ఇంటి ఎదుట భారీ మెడి చెట్టు ఉండటంతో నరేందర్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆ చెట్టుకు గీత గీస్తే కల్లు కారుతుందా లేదా అన్న అనుమానంతో రెండు, మూడు రోజుల నుంచి గీత గీయడం ప్రారంభించారు.

మెడి చెట్టుకు కల్లు లొట్టి కట్టి పరీక్షించాడు. ఇంకేముంది అనుకున్నదే నిజమైంది. మేడి చెట్టు నుంచి నిత్యం ఉదయం పది, సాయంత్రం పది సీసాల కల్లు పారుతోంది. గ్రామానికి చెందిన వారు మెడి చెట్టు కల్లు తాగి రుచిని పరీక్షించారు. ఆ కల్లు తాగిన జనాలకు కాళ్ల నొప్పులు సైతం మాయం అవ్వడంతో మేడికల్లు ప్రచారం ఇతర గ్రామాలకు పాకింది. కల్లు తాగేందుకు చిన్న కొత్తపల్లి గ్రామానికి క్య కట్టారు. ఆ కల్లు తాగిన వారు రుచికరంగా ఉందంటూ ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతున్నారు. దీంతో యజమాని నరేందర్ గౌడ్‌కు మేడిచెట్టు కల్లు జేబులు నిండేలా చేస్తోంది. 


Similar News