హీల్ బ్రేక్ లాక్ .. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది....

Update: 2024-07-06 04:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలుకు హీల్ బ్రేక్ లాక్ అయింది. దీంతో లోకో పైలెట్ అప్రమత్తమయ్యారు. వెంటనే రైలును మిర్యాలగూడ వద్ద నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. చిన్న సమస్యేనని, మరమ్మతుల తర్వాత రైలు యధావిథిగా సికింద్రాబాద్ వెళ్తుందని అధికారులు తెలిపారు. రైలు ఆలస్యంకావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 


Similar News