Rajendra prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు మృతి
టాలీవుడ్ నటుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్/కూకట్‌పల్లి: టాలీవుడ్ నటుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆయన కూతురు గాయత్రి (38)కి హఠాత్తుగా గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచారు. అయితే, గాయత్రికి భర్త, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గాయత్రి పార్థీవ దేహాన్ని రాజేంద్ర ప్రసాద్ నివాసం ఉంటున్న కేపీహెచ్‌బీ కాలనీలోని ఫార్చ్యూన్ విల్లా 226లో సందర్శనకు ఉంచారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.