రాఘవ లారెన్స్‌తో జతకట్టనున్న బుట్టబొమ్మ..? వైరల్ అవుతున్న న్యూస్..!
అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత సినిమాలు అన్ని ప్లాప్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదు కూడా తెచ్చుకుంది. ఇక టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పి కోలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అక్కడ విజయ్, సూర్య హీరోలుగా నటిస్తున్న తమిళ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ రెండు సినిమాలు 2025లో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ భామ తమిళ సినిమా ‘కాంచన 4’ లో నటిస్తున్నారంటూ ఓ వార్త షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ న్యూస్ నిజమేనని, పూజా హెగ్డే దాదాపు ఈ మూవీలో ఖరారయ్యారని సమాచారం. రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పూజా ఓ డెవిల్ రోల్ చేయనున్నారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ హారర్ మూవీ గురించి ఓ అప్‌డేట్ రానుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.