మా యూనిఫామ్ కోడ్ మార్చండి.. హెల్త్ సెక్రెటరీ‌కి నర్సింగ్ అసోసియేషన్ లేఖ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్ల డ్రెస్ కోడ్‌ను మార్చాలని నర్సింగ్ అసోసియేషన్లు హెల్త్ సెక్రటరీకి లేఖ రాశాయి.

Update: 2024-10-04 17:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్ల డ్రెస్ కోడ్‌ను మార్చాలని నర్సింగ్ అసోసియేషన్లు హెల్త్ సెక్రటరీకి లేఖ రాశాయి. పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్​మెడికల్ ఎడ్యుకేషన్, టీవీవీపీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని తీసుకురావాలని రిక్వెస్ట్ చేశాయి. ఇప్పటికీ పాత కాలం నాటి యూనిఫామే కొనసాగుతుందని, ఆ వైట్ డ్రెస్‌లతో క్లినికల్, వార్డ్, ల్యాబ్, తదితర వర్క్ ప్లేస్‌లతో ఇబ్బందిగా మారుతున్నాయని లేఖలో వివరించారు.

మోడ్రన్ కాలంలోకి వచ్చాక కూడా ఇంకా పాత యూనిఫామ్ కలర్సే కొనసాగుతున్నాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వాసుపత్రులు కూడా కనిపించాలంటే స్టాఫ్​యూనిఫామ్ ఛేంజింగ్ కూడా ముఖ్యమే అంటూ లేఖలో స్పష్టం చేశారు. దేశమంతటా ఇప్పుడు యూనిఫామ్ కోడ్ మారిపోయిందని, మన స్టేట్‌లో ఈఎస్‌ఐ, నిమ్స్‌లోనూ కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. దీని వలన ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడదని నర్సింగ్ అసోసియేషన్లు లేఖలో వివరించాయి.


Similar News