ఆగమైన ఆటోవాలా బ్రతుకులు !!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మూడు టైర్ల బండి ఆటో టైర్ కదలక బతుకు బండి సాగడం లేదని తీవ్ర స్థాయిలో తల్లడిల్లుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-07-01 11:35 GMT

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మూడు టైర్ల బండి ఆటో టైర్ కదలక బతుకు బండి సాగడం లేదని తీవ్ర స్థాయిలో తల్లడిల్లుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోవాలాలు, గిరాకి లేక ఆటో ఎక్కేవారు కరువై బుక్కెడు బువ్వ కోసం యుద్ధం చేస్తున్నవి ఖాళీ కడుపులు అని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆగమైన ఆటోవాలా బ్రతుకులు మళ్లీ దారిన పడేది ఎన్నడో అని ఆటోవాలాలు చెమగిల్లుతున్నారు.

ఒకప్పుడు కూలి పని కంటే ఉత్తమమైన జీవితం ఆటో డ్రైవర్ జీవితం అని చెప్పుకునే వాళ్ళమని, ఇప్పుడు బిచ్చగాళ్ళ కంటే హీనమైన బ్రతుకులు ఆటోవాలా బ్రతుకులు అని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఓనర్ అయితే ఒక రకంగా, డ్రైవర్ అయితే మరో రకంగా, బతుకులు హీనంగా నడుస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా రోజుకు కనీసం 200 కూడా సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తీవ్ర బాధల తమ కష్టాలను తెలుపుతున్నారు. సర్కార్ సార్లు జర దయ చూపి పెన్షన్ ఇవ్వండి అని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు.

Similar News