ప్రజాసేవతో జీవితం ధన్యం

ప్రజా సేవతోనే ప్రజా ప్రతినిధుల జీవితాలు ధన్యం అవుతాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.

Update: 2024-07-03 11:40 GMT

దిశ, కోరుట్ల రూరల్ : ప్రజా సేవతోనే ప్రజా ప్రతినిధుల జీవితాలు ధన్యం అవుతాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండల ప్రాదేశిక సభ్యుల పదవీకాలం బుధవారం ముగిసిన సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుందన్నారు. పదవీ కాలంలో చేసిన సేవలతో ప్రజాప్రతినిధులు ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటారన్నారు. కోరుట్ల మండల పరిషత్ ఆధ్వర్యంలో పల్లె పల్లెనా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. తాను పదవిలోకి వచ్చిన కొద్దిరోజులకే మండల ప్రాదేశిక సభ్యుల పదవీకాలం

    ముగియడం కొంత బాధాకరమే అయినా సభ్యులంతా పదవితో సంబంధం లేకుండా ప్రజల మధ్య సేవచేస్తూ గడపాలని సూచించారు. ఈ సందర్భంగా పదవీ కాలం ముగించుకుంటున్న జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ తోట నారాయణ మాట్లాడుతూ ఈ పదవీ కాలం ఎన్నో మంచి పనులు చేసే అవకాశం మాకు కల్పించిందని అన్నారు. సభ్యులంతా మండల సభను ఉపయోగించుకుని ప్రజా సమస్యలకు కృషి చేయడం ప్రశంసనీయం అన్నారు. అనంతరం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు జెడ్పీటీసీలు దారిశెట్టి లావణ్య రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటీ స్వరూప వెంకట్రావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ నీరజ, మెట్ పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు. 


Similar News