సరోజా ఇండెన్ గ్యాస్ ఎదుట వినియోగదారుల ధర్నా

ఇన్సూరెన్స్ పేరిట సరోజా ఇండెన్ గ్యాస్ ఆధ్వర్యంలో ఇంటింటి తనిఖీలు

Update: 2024-07-05 12:25 GMT

దిశ,ముస్తాబాద్ : ఇన్సూరెన్స్ పేరిట సరోజా ఇండెన్ గ్యాస్ ఆధ్వర్యంలో ఇంటింటి తనిఖీలు చేపట్టి ఒక్కో కనెక్షన్ నుండిరూ .250 వసూలు చేయడం పై దుమారం రేగింది.వివరాల్లోకి వెళితే సరోజా ఇండెన్ గ్యాస్ పేరిట కొందరు ఏజెంట్లు గ్రామాల్లో ఇంటింటా సిలిండర్ తనిఖీలు చేసి సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అని చూసి వారి వద్ద నుండి 240 రూ .ఇన్సూరెన్స్ పేరిట చార్జీలు వసూలు చేశారు.తీరా చూస్తే ఇది బోగస్ అని తేలడంతో వినియోగదారులు శుక్రవారం మండల కేంద్రంలోని గ్యాస్ కార్యాలయం ఎదుట మా డబ్బులు మాకు ఇవ్వాలని బైఠాయించారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తోట ధర్మేందర్, కోల కృష్ణ లు , చీకోటి మహేష్ లు వినియోగదారుల పక్షాన నిలబడి సంబంధిత ఏజెన్సీ ని నిలదీశారు. రూరల్ సిఐ మొగిలి, సివిల్ సప్లై అధికారి అక్కడికి చేరుకుని జరిగిన తప్పిదం పై ఆరా తీశారు. అనంతరం సీఐ మొగిలి నచ్చజెప్పడంతో వినియోగదారులు వెనుదిరిగారు.


Similar News