కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ కు మహర్ధశ..

దశబ్దాల చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేల కథలాపూర్,

Update: 2024-11-19 09:32 GMT

దిశ, కథలాపూర్ : దశబ్దాల చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేల కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల వరప్రదాయినిగా పేరు గాంచిన కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ కు మహర్ధశ కలిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న 9 ప్రాజెక్టుల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఒకటి.సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ కు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో అంకురార్పణ జరిగింది.కానీ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది గత ప్రభుత్వ హయాంలో కనీసం ఒక పిడికెడు మట్టిని కూడా తీసిన పాపాన పోలేదనేది గత ప్రభుత్వం పట్ల విమర్శ. ప్రతి ఎలక్షన్స్ లో సూరమ్మ ప్రాజెక్ట్ పేరుతో ఓట్లు దండుకొని లబ్ది పొందడం తప్ప ప్రాజెక్ట్ విషయంలో చిత్తశుద్దిని కనబర్చలేదనేది రైతుల వాదన.

2018 సంవత్సరంలో కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం నాటి నీటిపారుదల శాఖ మంత్రి గా ఉన్న తన్నీరు హరీష్ రావు కలికోట గ్రామంలో పది వేల మంది సాక్షి గా శిలాఫలకం వేసి 206 కోట్లతో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు.దీంతో రైతుల్లో మళ్లీ నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ అనేది మా హక్కు, కోరిక కానీ అది కలగానే మిగిలిపోతుందా అనే కోణంలో రైతులు ఆందోళన లో ఉండి పోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రైతుల్లో ఆశలు మొలకెత్తాయి. ఈ ప్రభుత్వం అయినా మా కలను సాకారం చేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది.

కాగా ప్రభుత్వం వచ్చిన 11 నెలలకు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పట్టుదలతో, కృషి తో రైతుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ ద్వారా కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల నిర్మాణానికి 520.29 ఎకరాల భూసేకరణ కోసం సోమవారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.దీని వల్ల కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల తో పాటు కోరుట్ల మండలంలోని కొన్ని గ్రామాలకు కూడా సాగునీటి కష్టాలు తీరనున్నాయి.అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మత్స కార్మికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రాజెక్ట్ మొదటి దఫా పనుల పట్ల పట్టుదల తో, అకుంఠిత దీక్షతో కృషి చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మత్సకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి : కల్లెడ గంగాధర్, రాష్ట్ర ఫిషర్ మెన్ ప్రధాన కార్యదర్శి

కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ మొదటి దఫా పనులను ప్రారంభిస్తూ,ఎన్నో ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న కల నేటికీ సాకారం చేస్తున్న మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.ఈ ప్రాజెక్టు వల్ల మా మత్సకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి.

చొరవ చూపుతున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు : అల్లూరి వెంకట్ రెడ్డి, రైతు, తాండ్రియాల గ్రామం

సూరమ్మ చెరువు భూగర్భ జలాల ద్వారా ఇప్పటికి మా గ్రామంలోని పంట పొలాలకు సాగు నీటికి, త్రాగు నీటికి ఆ జలలే ఆధారం. కానీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మా రైతులకు ఖరీఫ్, రబీ పంటలకు ఎలాంటి ఆటంకం లేకుండా పంటలు పండుతాయి.ఇట్టి విషయంలో చొరవ చూపుతున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.


Similar News