మూలన పడిన మధ్యాహ్న భోజనం..

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మూలన పడింది.

Update: 2024-11-19 08:47 GMT

దిశ,తంగళ్లపల్లి : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మూలన పడింది.. సర్కారు బడిలో చదువుతున్న పిల్లలు ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటేనే కడుపు నిండే పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకో లేదంటే పస్తులతోనే చదువులు కొనసాగించాల్సిందే... ఇది తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి.. గత కొన్ని రోజులుగా ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పిల్లలకు నిలిపివేయడంతో లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ఇంకా మరికొన్ని రోజులు ఇలాగే లంచ్ బాక్సులు తెచ్చుకోవాలని హెచ్ఎం తెలిపినట్లు చిన్నారులు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం ఎందుకు అమలు కావడం లేదని, ఇలా ఎన్ని రోజులు లంచ్ బాక్సులు తెచ్చుకోవాలని అడగగా, హెచ్ఎం మధుసూదన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కొసమెరుపు.


Similar News