తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ప్రజాపాలన.. ప్రజా విజయోత్సవ వేడుకలు..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ప్రజా పాలన, ప్రజా విజయోత్సవ వేడుకలను కరీంనగర్ మండలం ఇరుకుల్ల, ముగ్ధంపూర్, బొమ్మకల్, దుర్శేడ్ గ్రామాలలో దుర్గం మురళి టీం కళాకారుల బృందం నిర్వహించింది.
దిశ, కరీంనగర్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ప్రజా పాలన, ప్రజా విజయోత్సవ వేడుకలను కరీంనగర్ మండలం ఇరుకుల్ల, ముగ్ధంపూర్, బొమ్మకల్, దుర్శేడ్ గ్రామాలలో దుర్గం మురళి టీం కళాకారుల బృందం నిర్వహించింది.
ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలను అవగాహన పరుస్తున్నారు. ఈ నెల 19వ తేదీన మొదలుకొని డిసెంబర్ 7 వరకు పల్లె పల్లెనా కళాకారుల మోత మోగనుందని కళాకారుల బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వొళ్ళల వాణి, ఎర్రవెల్లి శంకర్, పుల్ల శంకర్, శ్రీకాంత్, తిరుపతి, అర్చన, సంధ్య, సౌమ్య, రాధా, ఇరుకుల్ల కార్యదర్శి సంతోష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.