ప్రీ ప్రైమరీ స్కూళ్లను అత్యుత్తమంగా తీర్చిదిద్దండి : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రీ ప్రైమరీ స్కూళ్లను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్

Update: 2024-06-26 12:41 GMT

దిశ,తిమ్మాపూర్ : ఫ్రీ ప్రైమరీ స్కూళ్లను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఐదు మండలాలకు చెందిన ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్లు (అంగన్వాడీ కార్యకర్తలు)లకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్ గా మార్చిందని పేర్కొన్నారు. మంచి ఆశయంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రీ ప్రైమరీ టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఆటపాటలతో విద్యను అందిస్తూ చిన్నారుల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు.

చిన్నారులకు సిలబస్ కూడా బాగుందని, టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ ప్రకారం టీచర్లు పని చేయాలని తెలిపారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను అత్యుత్తమంగా సమూలంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కష్టపడే టీచర్లకు తగిన గుర్తింపు ఇస్తామని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్న ప్రీ ప్రైమరీ స్కూళ్ల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో టీచర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి సబిత, తిమ్మాపూర్ తహసీల్దార్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News