పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి

Update: 2024-06-26 12:00 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మంజూరైన పనులు ఇప్పటి దాకా ఎన్ని మంజూరు అయ్యాయో, ఎన్ని పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. (ఎం.ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్.) ఉపాధి హామీ పథకం కింద ఎన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారో, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయో, అమ్మ ఆదర్శ పాఠశాలల కింద విద్యాలయాల్లో ఎన్ని పనులు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ కింద మొదలు పెట్టిన రోడ్డు, ఇతర నిర్మాణ పనుల్లో వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ సూర్య ప్రకాష్, డీఈలు శ్రీనివాస్, సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, పవన కుమారి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Similar News