విద్యార్థులకు కెరీర్ పై అవగాహన

స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాల ఖని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు....Career awareness for students

Update: 2022-12-28 13:03 GMT

దిశ, గోదావరిఖని: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాల ఖని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు కావలసిన నైపుణ్యాలు అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కరీంనగర్ కి చెందిన ప్రముఖ వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు అనంతుల సతీష్ హాజరై ఎంబీఏ, ఎం కామ్, ఇతర పీజీ విద్యార్థులకు కావలసిన వివిధ రకాల నైపుణ్యాలను, కెరియర్ కు అవసరమైనటువంటి సూచనలు, సలహాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆధునిక ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి అవసరమైనటువంటి ఏంట్రా ప్రీనూయర్ లక్షణాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ టీం బిల్డింగ్ గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఎంటర్ప్రైన్షిప్ రిసోర్స్ ప్లానింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, సోషల్ మీడియా మార్కెటింగ్, మోడరన్ హెచ్ఆర్ఎం, సమీకృత విత్త సేవలు సేవలు, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా డిజిటల్ లెర్నింగ్ సోర్స్ వ౦టి అంశాలపైన విద్యార్థినీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ అనంతల సతీష్ ను శాలువాతో సన్మానించి జ్ఞాపకం బహుకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రమాకాంత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వై. ప్రసాద్. అధ్యాపకులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ రవి, రమేష్, అజయ్, అజీజ్ సల్మా, యాదయ్య మరియు ఎంకాం, ఎంబీఏ, ఎంఎస్సీ విద్యార్థులు పాల్గొన్నారు.



Tags:    

Similar News