సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్ - 100 పై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే, వెంటనే డయల్ - 100 కు కాల్ చేయాలని ఎస్సై ఎల్.శ్రీకాంత్ అన్నారు.
దిశ, గంభీరావుపేట : సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్ - 100 పై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే, వెంటనే డయల్ - 100 కు కాల్ చేయాలని ఎస్సై ఎల్.శ్రీకాంత్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో, మంగళవారం రాత్రి మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎల్.శ్రీకాంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులమని రుణమాఫీ వస్తుందని కరెంట్ బిల్లు కట్టాలని, కేవైసీ అప్డేట్ చేయాలని, విదేశాలలో మీ పిల్లలు ఉంటే వారి పేరు చెప్పి అక్కడ నేరం చేశారని చెప్పి మోసం కాల్ చేస్తారు. మీకు తెలియని లింకులు పంపిస్తే ఓపెన్ చేయవద్దు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సల్స్ వస్తున్నాయా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు ఉంటే ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. యువతీయువకులకు గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అట్టి వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి, వీపీవో శ్రీనాథ్ రాజు తదితరులు పాల్గొన్నారు.