ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
దిశ, గంగాధర : చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఏడాది కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి దూసుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, తాళ్ల శ్రీనివాస్, పడాల రాజన్న, రోమాల రమేష్, దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, బట్టు లక్ష్మణ్ నారాయణ, కర్ర విద్యాసాగర్ రెడ్డి, వోడ్నాల యగ్నేష్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాసరెడ్డి, పడితపల్లి కిషన్, అట్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.