పెద్దాపూర్ పాఠశాల ఫుడ్ ఇన్చార్జి సస్పెన్షన్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ (బాలుర) గురుకుల పాఠశాల ఫుడ్ ఇన్చార్జి కిషోర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ (బాలుర) గురుకుల పాఠశాల ఫుడ్ ఇన్చార్జి కిషోర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల్లో నాణ్యత లేనందున ఫుడ్ ఇన్చార్జిగా ఉన్న ఉపాధ్యాయుడు కిషోర్ ను సస్పెండ్ చేస్తూ సంబంధిత ప్రిన్సిపాల్ కు మెమోను జారీ చేశారు.